ఎన్నికలు ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా

ఎన్నికలు ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (MAA) ఎన్నికలకు ఏకగ్రీవం చేయాలని సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. అలా చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని అన్నారు. ఇదే విషయంపై MAA అధ్యక్ష ఎన్నికలపై మరో లేఖ రాశారు. ఏకగ్రీవం చేయని పక్షంలో పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. పెద్దలను గౌరవిస్తాం..వాళ్ళ సలహాలు పాటిస్తాం..మా యంగర్ జనరేషన్ ని ఆశీర్వదించి..MAA  ప్రెసిడెంట్ గా  నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానంటూ లేఖలో తెలిపారు మంచు విష్ణు.

అంతేకాదు MAA అసోసియేషన్‌ భవనాన్ని తాను.. తన కుటుంబ సభ్యులం కట్టిస్తామని తెలిపారు.